News February 3, 2025
WCలో త్రిష.. జిల్లా పేరు నిలబెట్టారు: భద్రాద్రి కలెక్టర్

ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గొంగడి త్రిషకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మలేసియాలో జరిగిన అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం వాసి గొంగడి త్రిషకు జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ అభినందనలు చెప్పారు. జిల్లా పేరును ప్రపంచ వేదికలో నిలబెట్టి, ఈరోజు చివరి మ్యాచ్లో అద్భుతంగా రాణించినందుకు అభినందించారు.
Similar News
News March 14, 2026
ప.గో: గ్యాస్ కష్టాలు.. బ్లాక్‌లో సిలిండర్ రూ.1800

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
News March 14, 2026
MHBD: టెన్త్ పరీక్షలకు 8,157 మంది విద్యార్థులు

జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న టెన్త్ పరీక్షలకు మొత్తం 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 4,001 మంది బాలికలు, 4,156 మంది బాలురు మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 435 మంది ఇన్విజిలేటర్లు, 45 చీఫ్ సూపరింటెండెట్లు, 45 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు.
News March 14, 2026
NTR: జాబ్ కోసం సెర్చ్.. భారీ మోసం

OLXలో ఉద్యోగం కోసం వెతికిన షేక్ అర్షద్ అనే యువకుడు మోసగాళ్ల చేతిలో చిక్కాడు. ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ప్రసాద్ అనే వ్యక్తి, అర్షద్ వద్ద రూ.3 లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


