News February 3, 2025
లింగాపూర్: పనిచేసుకుని బ్రతకమన్నందుకు చనిపోయాడు!

పనిచేసుకోని బ్రతుకు అన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట లింగాపూర్ మండలంలోని వంజారిగూడ గ్రామంలో చోటుచేసుకున్నది. లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపిన వివరాలిలా.. వంజారిగూడకి చెందిన అవినాష్ (19) రెండేళ్ల క్రితం చదువు మానేసి ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి హనుమంతు ఏదైనా పని చేసుకోవాలని మందలించడంతో జనవరి 31న ఇంట్లోనే ఉన్న గుర్తుతెలియని పురుగు మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News November 14, 2025
ప్రీక్లాంప్సియా లక్షణాలు

ప్రీక్లాంప్సియా గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్య. ఇది హైబీపీతో ప్రారంభమై, ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ప్రీక్లాంప్సియా ఉన్న గర్భిణుల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, ముఖం వాపు, తలనొప్పి, మసక మసకగా కనిపించడం, కంటిలో నల్లటి మచ్చలు, కడుపులో కుడివైపునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటివి. ప్రెగ్నెన్సీలో ఒత్తిడికి దూరంగా ఉంటూ, రక్తప్రసరణ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News November 14, 2025
ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించిన కలెక్టర్

మెట్‌పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూరు గ్రామాల్లోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రవాణా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. కలెక్టర్, ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీఓ రఘువరన్, తహశీల్దార్ నీతా, తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో BRS ఓటమికి కారణాలివే?

జూబ్లీహిల్స్‌లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)


