News February 3, 2025
నరసరావుపేట: సోమవారం గ్రీవెన్స్ రద్దు చేసిన జిల్లా ఎస్పీ

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వివరాలు తెలిపారు. గుంటూరు- కృష్ణా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 4, 2026
వరుసగా విఫలం.. అయినా నం.1 గానే అభిషేక్!

T20ల్లో ఇటీవల వరుసగా <<19276161>>విఫలమవుతున్నా<<>> తన నం.1 ర్యాంకును అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నారు. 874Ptsతో తొలిస్థానంలో ఉన్నారు. అయితే పాక్ బ్యాటర్ ఫర్హాన్(848) నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ODIల్లో మిచెల్, కోహ్లీ, జద్రాన్, రోహిత్, గిల్ టాప్-5లో ఉన్నారు. బౌలింగ్‌లో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్, ODIల్లో రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నారు. టీమ్ ర్యాంకుల్లో ODIలు, T20ల్లో ఫస్ట్, టెస్టుల్లో 4వ ప్లేస్‌లో ఇండియా ఉంది.
News March 4, 2026
KGHలో నర్సింగ్ సిబ్బంది తీవ్ర కొరత

KGHలో నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 40 హెడ్ నర్సులు, 150కు పైగా స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 70 మంది ఉండాల్సిన హెడ్ నర్సుల్లో కేవలం 30 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక్కో హెడ్ నర్స్ 3 నుంచి 4 వార్డులు పర్యవేక్షించాల్సి వస్తోంది. ఖాళీగా ఉన్న 108 నర్సింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డాక్టర్లు, రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News March 4, 2026
సుప్రీంలీడర్ నియామకంపై వార్తలు.. స్పందించిన ఇరాన్

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ <<19292894>>సుప్రీంలీడర్‌గా<<>> ఎన్నికైనట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించింది. అందులో నిజం లేదని చెప్పింది. ‘ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక చేసిన అభ్యర్థుల గురించి మీడియాలో వస్తున్న రిపోర్టులకు అధికారిక ఆధారాలు లేవు. వాటిని తిరస్కరిస్తున్నాం’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ స్పష్టం చేసింది. మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ప్రకటించనున్నారని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది.


