News February 3, 2025
ఎన్టీఆర్: డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 20లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఈ పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News February 3, 2025
అనకాపల్లి: మత్స్యకారులకు అందని భృతి
చేపల వేట నిషేధానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇప్పటివరకు అందలేదు. ప్రతి ఏటా మాదిరిగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. జిల్లాలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిహారం చెల్లించడానికి అవకాశం లేకుండా పోయింది.
News February 3, 2025
SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
News February 3, 2025
KKD: మద్యం షాపులో లాటరీ.. తగిలితే థాయ్‌లాండ్
మద్యం షాపులతో లాభం రాని వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కాకినాడ గుడారిగుంటకు చెందిన ఓ వ్యాపారి మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ దుకాణంలో అన్ని రకాల బ్రాండ్‌లు దొరుకుతాయని.. పుల్ బాటిల్ కొంటే థాయిలాండ్ టూర్ వేళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ లాటరీ స్కీమ్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల మందుబాబులు ఈ షాపు వద్దకు క్యూ కడుతున్నారు.