News February 3, 2025

సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు వద్దు: ఎస్పీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని అన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, రాజకీయ నాయకుల, కుల మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News March 14, 2025

వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

image

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.

News March 14, 2025

సూపర్ ఐడియా కదా..!

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!

News March 14, 2025

సంగారెడ్డి: గుండెపోటుతో యువకుడి మృతి

image

హత్నూర మండలం శేరుకంపల్లికి చెందిన దండు శివకుమార్(28) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. స్థానికుల వివరాలిలా.. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న శివ.. గురువారం రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమార్పీఎస్ నాయకులుగా పనిచేస్తూ సమాజ సేవ చేసేవారని స్థానికులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే శివ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 

error: Content is protected !!