News February 3, 2025

MBNR: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. వివరాలు ఇలా !

image

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం ద్వారా రెండు విడతల్లో రూ.12 వేలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. మొదటి విడత లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. MBNR-13,909, NGKL-12,284, GDWL-10,380, NRPT-8,180, WNPT-9,978 మంది అర్హులని అధికారులు గుర్తించారు. ఆహార భద్రత కార్డు కుటుంబం కలిగి.. భూమిలేని రైతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 దినాలు కూలీగా పని చేసినట్లు మస్టర్‌లో నమోదై ఉండే వారు అర్హులుగా తెలిపింది.

Similar News

News March 14, 2026

NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

image

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

HYD: రూ.5‌కే భోజనం.. గ్యాస్ ఇబ్బందులు లేవు!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5 కే భోజనానికి గ్యాస్ ఇబ్బంది ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే ఇక్కడ అన్నం, పప్పును సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే విద్యుత్‌తో వండుతారు. తక్కువ మొత్తంలో మాత్రమే గ్యాస్ వినియోగం ఉంటుంది. అయితే దీనికి నిల్వలు ఉన్నాయని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అందరూ వాడితే గ్యాస్ వినియోగం తగ్గించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News March 14, 2026

1,300 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు 6 రోజులే గడువు

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19. వెబ్‌సైట్: https://www.idbi.bank.in/