News February 3, 2025
సాలూరు అమ్మవారి పండుగపై మంత్రి సమీక్ష
సాలూరు శ్యామలాంబ తల్లి పండుగను మే 18,19,20 తేదీల్లో నిర్వహించనున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ పండగ జరగనుంది. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పండగ ఏర్పాట్లపై పెద్దలు, అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News February 3, 2025
SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
News February 3, 2025
KKD: మద్యం షాపులో లాటరీ.. తగిలితే థాయ్‌లాండ్
మద్యం షాపులతో లాభం రాని వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కాకినాడ గుడారిగుంటకు చెందిన ఓ వ్యాపారి మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ దుకాణంలో అన్ని రకాల బ్రాండ్‌లు దొరుకుతాయని.. పుల్ బాటిల్ కొంటే థాయిలాండ్ టూర్ వేళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ లాటరీ స్కీమ్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల మందుబాబులు ఈ షాపు వద్దకు క్యూ కడుతున్నారు.
News February 3, 2025
పెదవేగి: పాత కక్షల నేపథ్యంలో పీక కోశారు
పాత కక్షల నేపథ్యంలో పెదవేగి మండలం, పినకడిమి గ్రామానికి చెందిన మరీదు మణికంఠ అనే వ్యక్తిపై ఆదివారం రాత్రి ఒక వ్యక్తి కత్తితో దాడి చేశారు. పీకను కోయడంతో మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.