News February 3, 2025

పాలమూరులో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపు: DK అరుణ

image

జడ్చర్లలో నూతనంగా ఏర్పాటుచేసిన బీజేపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని అన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు, మహిళలు, రైతులు, యువకులు, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారని తెలిపారు.

Similar News

News February 3, 2025

MBNR: GET READY.. నేటి నుంచే ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 20 రోజులపాటు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. MBNR-8400, WNPT-4,101, NGKL-2680, NRPT-2360, GDWL-2,230 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 261 ఇంటర్మీడియట్ కళాశాలలో ఉండగా.. ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.

News February 2, 2025

బాలానగర్‌: గ్రామంలో మద్యం అమ్మితే రూ.50వేల జరిమానా

image

బాలానగర్ మండలం నేరళ్ళపల్లిలో గ్రామంలో మద్యం అమ్మకాలపై గ్రామస్థులు నిషేధం విధించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామంలో మద్యపానం నిషేధం విధించామని, మద్యం అమ్మితే రూ.50 వేలు, తాగిన వారికి రూ.30 వేలు జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. మద్యం అమ్మినట్లు పట్టుకుంటే రూ.10 వేలు నజరానా అందజేస్తామన్నారు. మధ్యపాన నిషేధానికి గ్రామస్థులు సహకరించాలన్నారు.

News February 2, 2025

NGKL: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.