News February 3, 2025
NGKL: కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ నిరనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, NSUI, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.
Similar News
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
News July 9, 2025
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?

AP: YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనకబడితే కొత్త మంత్రులు వస్తారని CM CBN ఇవాళ <<17007606>>వార్నింగ్<<>> ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. నాగబాబుకు MLC పదవి దక్కిన తొలినాళ్లలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఆయన్ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. తాజాగా CM చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
News July 9, 2025
వరంగల్ నిట్‌లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్‌తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.