News February 3, 2025
కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు
కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.
Similar News
News February 3, 2025
కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
News February 3, 2025
NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా
పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్‌కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.
News February 3, 2025
ప్రజా పాలన కాదు.. పిచ్చి నారాయణ పాలన: కాకాణి
వైసీపీ మద్దతుదారుల ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. వైసీసీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చారని, ఆయన అక్కడే ఏళ్లుగా ఉన్నారన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. ‘ఇది పిచ్చి నారాయణ పాలన అని ప్రజలే తమ గోడును వెల్లబోసుకుంటారని కాకాణి ఎద్దేవా చేశారు.