News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం

సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Similar News
News March 26, 2026
NZB: డీజేలు, డ్రోన్లకు అనుమతి లేదు: సీపీ

శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల నిర్వహణపై పోలీస్ కమిషనరేట్‌లో సీపీ పి.సాయిచైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ర్యాలీలు గతంలో అనుమతించిన మార్గాల్లోనే సాగాలని, కొత్త రూట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా డీజేలు, డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
News March 26, 2026
NZB: రేపు వైన్స్ షాపులు బంద్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ సీపీ పి.సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 27న ఉదయం 6 నుంచి 28వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, క్లబ్బులు మూసివేసి ఉంచాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.
News March 26, 2026
NZB: ఎలాంటి వదంతులను నమ్మవద్దు: సీపీ

నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


