News March 19, 2024
విషాదం: గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి

AP: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది. నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది. వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News August 28, 2025
నాలుగు జిల్లాలకు RED ALERT

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
News August 28, 2025
లాంగ్ గ్యాప్ తర్వాత RCB ట్వీట్.. ఏమందంటే?

దాదాపు 3 నెలల తర్వాత RCB Xలోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పెషల్ లెటర్ పోస్ట్ చేసింది. ‘సైలెన్స్ ఆబ్సెన్స్ కాదు.. బాధ. JUN 4th అంతా మార్చేసింది. హృదయాల్ని ముక్కలు చేసింది. ఈ సమయంలో ‘RCB CARES’కి ప్రాణం పోశాం. ఫ్యాన్స్‌కు అండగా నిలిచేందుకు ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడుతుంది. మేం తిరిగొచ్చింది సెలబ్రేషన్‌తో కాదు.. మీతో కలిసి నడవడానికి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని పేర్కొంది.
News August 28, 2025
డేటింగ్ యాప్స్‌లో మహిళా యూజర్లే ఎక్కువ!

సాధారణంగా డేటింగ్ యాప్స్‌లో పురుషులే ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోని డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్‌లో ఫీమేల్ యూజర్లే ఎక్కువ ఉన్నారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్‌లో 57% మంది సబ్స్క్రైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్స్క్రిప్షన్ ఫీ రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.