News February 3, 2025
తిరుమల: ‘రథసప్తమి వేడుకలను విజయవంతం చెయ్యండి’

ఈనెల 04వ తేదీన జరగనున్న తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల నిర్వహణపై జిల్లా పోలీసు భద్రతాపరమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News April 7, 2026
తుమ్మిడిహట్టి సాధ్యమేనా!?

ASF జిల్లా కౌటాల మండలంలో మధ్యలో నిలిచిపోయిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడంతో సాధ్యాసాధ్యాలపై చర్చలు జోరందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం ఈ ప్రాజెక్టు అమలు అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా MHలోని బర్డ్స్ శాంక్చురి ముంపు సమస్య కారణంగా అక్కడి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
News April 7, 2026
ఖమ్మం: బంకుల్లో లీటరుకు రూ.5 అదనపు భారం

ఖమ్మం జిల్లాలో పెట్రోల్ ధరల తారతమ్యం వాహనదారులను అయోమయానికి గురిచేస్తోంది. రిలయన్స్, నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్ ధరను రూ.112గా నిర్ణయించడంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ఇతర బంకుల్లో రూ.107కే లభిస్తుండగా, ఇక్కడ అదనంగా రూ.5 వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల వ్యత్యాసంపై సమాచారం లేని జనం బంకులకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.
News April 7, 2026
ప్రొద్దుటూరుకు 2 కోర్టులు మంజూరు.!

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను (ఉద్యోగులను) మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, Iవ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచర్‌ను, లైబ్రరీని మంజూరు చేశారు.


