News February 3, 2025

నర్మల వాసికి జాతీయ నంది అవార్డు

image

గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ప్రముఖ కథ, నవల రచయిత గుండెల్లి నీలకంఠం జాతీయ నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవలు చేశారని ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 3, 2025

CBSE 10, 12వ తరగతి అడ్మిట్ కార్డులు

image

CBSE టెన్త్, 12వ తరగతులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, టెన్త్ పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. దేశ వ్యాప్తంగా 8,000 స్కూళ్ల నుంచి సుమారు 44 లక్షల మంది ఈ బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 3, 2025

శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

image

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.

News February 3, 2025

ధర్మపురి: శ్రీ లక్ష్మీనరసింహుడి ఆదాయం ఎంతంటే.. 

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ కార్యక్రమాల ద్వారా అదివారం రూ.2,52,508ల  ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,092, ప్రసాదాల అమ్మకం- రూ.95,820, అన్నదానం- రూ.29,596లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.