News February 3, 2025
అభిషేక్ హిట్టింగ్.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్: బట్లర్
చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Similar News
News February 3, 2025
‘లక్కీ భాస్కర్’ తరహాలో డబ్బు సంపాదించాలనుకుని..
AP: లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంకు సొమ్మును వాడుకుని మనీ సంపాదిస్తాడు. అదే తరహాలో చేయాలనుకుని ఓ ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. మార్కాపురంలోని సచివాలయ కార్యదర్శి P.వెంకటేశ్వర్లు పింఛన్ల సొమ్ము ₹2.66L తీసుకుని JAN 31న పారిపోయాడు. వివిధ బెట్టింగ్ యాప్‌లలో పెట్టి ఒక్క రోజులోనే ₹10L సంపాదించాలనుకుని మొత్తం పోగొట్టుకున్నాడు. బంధువులు డబ్బు చెల్లించడంతో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు.
News February 3, 2025
కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ
కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
News February 3, 2025
ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం
TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.