News March 19, 2024
పెనమలూరు తెరపైకి కొత్త పేర్లు..?

కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే బోడే ప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేకపోతున్నామని అధినేత చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో రోజురోజుకి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పెనమలూరు తెరపైకి తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజా, దేవినేని చందు పేర్లు అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది.
Similar News
News September 3, 2025
కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.
News September 3, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.