News February 3, 2025
RG Kar మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనతో వార్తల్లో నిలిచిన కోల్‌కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన జరిగింది. అక్కడి ESI క్వార్టర్స్‌లో MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తలుపు తీయకపోవడంతో తల్లి డోర్‌ను తోసుకుని లోపలికి వెళ్లగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రూమ్‌లో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News February 3, 2025
క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?
2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్‌ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.
News February 3, 2025
కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
News February 3, 2025
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.