News March 19, 2024
బాపట్ల TDP MP అభ్యర్థిగా ఎంఎస్ రాజు

AP: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. అలాగే గంటా శ్రీనివాసరావుకు ఆసక్తి లేకపోయినా చీపురుపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై TDP అధికారిక ప్రకటన చేయనుంది.
Similar News
News March 4, 2026
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్‌గా ఖమేనీ కుమారుడు!

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
News March 4, 2026
నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్‌రేట్ కలిసొచ్చి సెమీస్‌కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్ రికార్డ్‌లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 4, 2026
అంగన్‌వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్‌వాడీల అరెస్ట్‌పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.


