News February 3, 2025
KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 3, 2025
శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ
శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేషపూజను ఏడాదికోసారి నిర్వహించారు.
News February 3, 2025
నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు
మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు.
News February 3, 2025
కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.