News February 3, 2025
వేములవాడ: నేడు అఘోరి వస్తుందా..? రాదా..?
గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో నేడు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పినట్లుగా నేడు నిజంగా ఆమె వేములవాడకు వస్తుందా..? రాదా..? అనేది మరికొద్దిసేపట్లో తెలవనుంది.
Similar News
News February 3, 2025
కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
News February 3, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 3, 2025
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.