News February 3, 2025

నేడు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

image

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. టీడీపీ నుంచి రమేశ్ కుమార్, వైసీపీ నుంచి లక్ష్మీ మహేశ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి చేరిన వారు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి 23 మంది సభ్యులు ఉండటంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పట్టణంలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు.

Similar News

News February 3, 2025

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

image

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేషపూజను ఏడాదికోసారి నిర్వహించారు.

News February 3, 2025

నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు

image

మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు. 

News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.