News February 3, 2025
సూర్యాపేట: సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మొదటి సారి సీసీ కెమెరాలో నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.
Similar News
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
News March 14, 2025
PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.