News February 3, 2025
జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Similar News
News January 10, 2026
విజయవాడ: పుస్తక ప్రియులకు శుభవార్త!

విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక మహోత్సవం ముగింపు దశకు చేరుకోవడంతో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారాల్లో సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మధ్యాహ్నం ఒంటి గంటకే స్టాల్స్‌ను తెరుస్తామని పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య తెలిపారు. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన, పాఠకుల సౌకర్యార్థం మరో గంట ముందే అందుబాటులోకి రానుంది.
News January 10, 2026
సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.
News January 10, 2026
NGKL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ మండలంలో 11.6, బల్మూర్ మండలంలో 12.0, తెలకపల్లి, వెల్దండ మండలలో 12.5, లింగాల మండలంలో 13.0, పదర మండలంలో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


