News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News November 4, 2025

సిరిసిల్ల: శిక్ష నుంచి నేరస్థులు తప్పించుకోలేరు: ఎస్పీ

image

నేరం చేసిన వారెవరూ శిక్ష నుంచి రేరస్థులు తప్పించుకోలేరని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మొత్తం 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News November 4, 2025

లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా ప్రజలు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ అదాలత్ ఈ నెల 4 నుంచి 15 వరకు జరుగుతుందన్నారు. యాక్సిడెంట్ కేసులు, తగాదాలు, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన ఇతర కేసుల్లో రాజీ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

News November 4, 2025

NLG: ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా.!

image

NLG జిల్లాలో ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. గ్రామాలు, మున్సిపల్ కేంద్రాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, క్షేత్రస్థాయిలోని అధికారులపై ఉన్నతాధికారులు ఓ వైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, నదులు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం ఇసుక తేలే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. అధికారులు స్పందించి ఇసుకను సరఫరా చేయాలన్నారు.