News February 3, 2025
అల్లూరి: కృష్ణా నదిని ఈదేశిన తండ్రీకూతురు

విజయవాడలో ఆదివారం నిర్వహించిన కృష్ణానది క్రాసింగ్ ఈత పోటీల్లో కూనవరం మండలం పల్లూరుకి తండ్రీ కూతురు సత్తా చాటారు. గ్రామానికి చెందిన ఆవుల సంతోష్ కుమార్ (35) అతని కుమార్తె ఆవుల శాన్వి(13) 1.5 కిలోమీటర్ల కృష్ణా నదిని విజయవంతంగా ఈదేశారు. తొలిసారి పోటీల్లో పాల్గొన్న శాన్వి 31.5 నిమిషాల్లో తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. సంతోష్ 36.45 నిమిషాల్లో క్రాస్ చేయగా.. అతను ఈ పోటీలో పాల్గొనడం ఇది మూడోసారి.
Similar News
News March 22, 2026
WGL: గ్యాస్ కొరత.. మూతబడుతున్న హోటల్స్

వరంగల్ నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ మూతపడుతున్నాయి. నగర వ్యాప్తంగా 3 వేల చిన్న, పెద్ద హోటల్స్ ఉండగా, గ్యాస్ కొరతతో 500కు పైగా హోటల్స్ మూత పడ్డాయి. దీంతో హోటల్ వృత్తిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. చిన్న, పెద్ద హోటళ్లు రోజూ వారి వినియోగానికి 4-5 సిలిండర్లు వాడుతున్నారు. సరఫరా తగ్గడంతో రేట్లు రూ.100-150కి పెరిగాయి. కొన్ని హోటల్స్ కట్టెలు, ఊక పొయ్యిలతో నడుపుతున్నారు.
News March 22, 2026
విశాఖ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు

తూ.గో.జిల్లా ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖలోని సీతమ్మధార, అల్లిపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వాడపల్లి వేంకన్న దర్శనం కోసం వెళ్తుండగా వీరి కారును రాజమండ్రి నుంచి KKD వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. వీరికి జీఎస్‌ఎల్ ఆస్పత్రిలో ప్రాథమికచికిత్స అందించారు. కారులో డ్రైవర్‌తో కలిపి ఏడుగురు ఉండగా ప్రాణాప్రాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
News March 22, 2026
మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!


