News February 3, 2025

వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్‌‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.

Similar News

News January 13, 2026

నెల్లూరు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్, SP

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.

News January 13, 2026

147పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్ (SAMEER) 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు JAN 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష FEB 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 13, 2026

తిరుపతి: 2నెలల జీతాలు విడుదల

image

ప్రభుత్వ గురుకుల స్కూల్లో ఉద్యోగంలో చేరిన 2025 డీఎస్సీ ఉపాధ్యాయులకు 2నెలల జీతాలు విడుదలయ్యాయి. ప్రాన్ నెంబర్ సమస్యతో ఉద్యోగంలో చేరిన 3నెలల్లో 2నెలలు జీతాలు రాలేదని Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన అధికారులు 1100 మంది ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేశారు.