News March 19, 2024

విశాఖ: మనస్తాపంతో విద్యార్థి సూసైడ్

image

విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 21, 2025

ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

image

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. జనవరిలో నిర్వహించిన రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

News April 21, 2025

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో 170 మంది తొలగింపు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.

error: Content is protected !!