News February 3, 2025

శావల్యాపురం: కాలువలో పడి తూ.గో జిల్లా యువకుడి మృతి

image

శావల్యాపురం మండలం ఘంటవారిపాలేం కాలువలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి రాజేశ్ (25)గా గుర్తించారు.   

Similar News

News December 26, 2025

MBNR జిల్లాలో 5 శాతం తగ్గిన నేరాలు

image

MBNR జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల రేటు 5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. 2024లో 5937 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 5662కు తగ్గిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన 11,775 దరఖాస్తులపై స్పందించి పరిష్కరించామన్నారు. భరోసా కేంద్రంతో 168 కేసులు నమోదు చేసి, 119 మంది బాధితులకు నష్టపరిహారం అందేలా చూశామన్నారు.

News December 26, 2025

మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

image

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

News December 26, 2025

రెవెన్యూ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్‌గా నాగభూషణం

image

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారి నాగభూషణం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రావణి, సెక్రటరీగా వంశీకృష్ణ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్వో మధుసూదనరావు శుభాకాంక్షలు తెలిపారు.