News February 3, 2025
కచిడి చేప@3.95 లక్షలు
AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.
Similar News
News February 3, 2025
కుంభమేళా భక్తుల భద్రతపై పిల్.. తిరస్కరించిన సుప్రీం
మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని UP ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.
News February 3, 2025
ఇంగ్లండ్‌పై పంజాబీల ఊచకోత!
ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వారు ఇంగ్లండ్ వారికి చుక్కలు చూపించడం ఇది కొత్తేమీ కాదని పోస్టులు పెడుతున్నారు. దేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చేందుకు ఆంగ్లేయులపై అప్పుడు భగత్ సింగ్, పదేళ్ల క్రితం క్రికెట్‌లో యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ బ్యాట్‌తో చుక్కలు చూపించారని చేసిన పోస్టర్ వైరలవుతోంది.
News February 3, 2025
రేపే రథసప్తమి.. విశేషాలివే
మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకొంటారు. ఆరోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. దేశవ్యాప్తంగా సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్య పూజ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదల్ని చేకూరుస్తుందనేది భక్తుల విశ్వాసం. సూర్యకిరణాలు ఒంటిపై పడటం ఆరోగ్యకరమని నమ్మిక. ఆదిత్య హృదయం, సూర్యాష్టోత్తర శతనామాల పఠనం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.