News March 19, 2024
మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్లపొదల్లో మహిళ చనిపోయి పడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 3, 2025
KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు-2025 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించగా, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం, సరైన ఆహారమే ఆరోగ్యానికి మూలం” అని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, పోషకాహార విభాగాధిపతి డా. విద్య, జీవ విజ్ఞానశాఖాధిపతి డా.మనోజ్ ఉన్నారు.
News September 3, 2025
KNR: ‘పాఠశాల విద్యలో జిల్లా ఆదర్శంగా నిలవాలి’

పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందుస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు వెల కట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
News September 3, 2025
KNR: రేపటి నుంచి వైన్స్ బంద్

వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.