News February 3, 2025
నిర్మల్: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

నిర్మల్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,828 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 18, 2026
ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు
News April 18, 2026
చంద్రబాబుకూ నితీశ్, షిండే పరిస్థితే: సీఎం రేవంత్

TG: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే మాదిరే భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో తక్కువ సీట్లు ఉన్నాయని టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.
News April 18, 2026
BREAKING: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, రజత్, జితేశ్,డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాష్
DC: KL రాహుల్, నిస్సాంక, రిజ్వీ, అక్షర్, మిల్లర్, స్టబ్స్, నబీ, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముఖేశ్


