News February 3, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: డీఐఈఓ

image

నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మొత్తంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 4,714 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు.

Similar News

News April 1, 2026

ఖమ్మం: పక్కదారి పడుతున్న సోలార్ పథకం..!

image

ఉమ్మడి జిల్లాలో ‘ప్రధానమంత్రి సూర్యఘర్’ పథకం అక్రమార్కుల చేతుల్లో పక్కదారి పడుతోంది. రెడ్కో అనుమతి లేని వ్యక్తులు డిస్కౌంట్ల పేరుతో నాణ్యత లేని సోలార్ ప్లేట్లు అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీ రాక ప్రజలు నష్టపోతున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులే బినామీలతో ఈ దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాధితులు 080-46733633 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

News April 1, 2026

సూర్యాపేట: వర్గపోరు.. సర్పంచ్ మామపై దాడి

image

అడ్లూర్‌లో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నెల 29న జరిగిన గ్రామసభలో ఇరువర్గాలు తలపడగా, మంగళవారం రాత్రి సర్పంచ్ మామ గువ్వల రామకోటయ్యపై ఉపసర్పంచ్ వర్గం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2026

GNT: నూతన ఆర్ధిక సంవత్సరం.. అధికారుల హడావుడి

image

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో అన్ని శాఖల్లో పనుల వేగం పెరిగింది. గత కాల పనుల పురోగతిని మార్చి 31తో కొలిచిన ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. డ్వామా, DRDA, హౌసింగ్, వ్యవసాయ శాఖలు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఉపాధి పనులు పూర్తి చేశారు. డ్రిప్ ఇరిగేషన్, మహిళా రాయితీల ఫైల్స్ క్లియర్ చేశారు. ఇక పనుల ఎంపిక, అమలులో కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు కానున్నాయి.