News February 3, 2025

రాజమండ్రి: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

image

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 13, 2025

‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

image

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2025

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

image

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.

News March 13, 2025

ఓటేరు చెరువును కాపాడుతాం: నారాయణ

image

భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడి తీరుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తేల్చి చెప్పారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ఓటేరు చెరువును నారాయణ పరిశీలించారు. అక్కడ చెరువు ఆక్రమణను చూసి ఆయన మండిపడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే చెరువును పూడ్చేందుకు కబ్జాదారులు యత్నించిన వైనాన్ని ఆయనకు సీపీఐ, సీపీఎం, ఆర్పీఐ నాయకులు వివరించారు.

error: Content is protected !!