News February 3, 2025
ప.గో: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News January 14, 2026
ఓడలరేవు తీరంలో ‘కైట్ ఫెస్టివల్’

అల్లవరం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో బుధవారం నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి, వారితో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించి, ప్రమాదాలకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని ఎంపీ సూచించారు.
News January 14, 2026
గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 14, 2026
ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.


