News March 19, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

image

TG: ఎన్నికల రోడ్‌షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్‌షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Similar News

News July 8, 2024

భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు

image

AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

News July 8, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 8, 2024

‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.