News February 3, 2025
మొరాయిస్తున్న ఇస్రో ఉపగ్రహం

గత నెల 29న ఇస్రో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహంలో స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్ సొంత నేవిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది.
Similar News
News March 15, 2026
LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.
News March 15, 2026
TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


