News February 3, 2025
కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News March 23, 2026
వరంగల్: పది పరీక్షల మూడవ రోజు 99.91% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.

అమలాపురం కలెక్టరేట్‌లో హై లెవల్ మీటింగ్.. కారణం ఇదే!

LPG గ్యాస్ బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడటం వల్ల స్వయం సమృద్ధి సాధ్యమని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం అమలాపురంలో హోటల్ యాజమాన్యాలు, వసతి గృహాల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గ్యాస్ కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పరాయి దేశాలపై ఆధారపడకుండా ఉండాలంటే ఇంధన వినియోగంలో మార్పులు రావాలని జేసీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.