News February 3, 2025

రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు

image

రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. వేల మందికి ఉద్యోగాలు లభిస్తామని తెలిపారు. కర్నూలులో ఏజీ జెన్కో, ఎన్‌హెచ్‌టీసీ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. కడప, నంద్యాల జిల్లాల్లో SAEL సోలాల్ ఎంహెచ్‌పీ-2 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఇక ఓర్వకల్లుకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

Similar News

News February 3, 2025

కర్నూలుకు జడ్జిల బృందం

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. బెంచ్‌కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దిన్నెదేవరపాడు వద్ద APERCకి చెందిన భవనాన్ని జడ్జిల బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కాగా గతేడాది రూ.25కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో ఆ భవనాన్ని నిర్మించారు.

News February 3, 2025

బస్ డ్రైవర్‌కు గుండెపోటుకు.. ప్రయాణికులు క్షేమం

image

ఆలూరులో నిన్న ఓ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. డ్రైవర్‌కు గుండెపోటుకు గురికావడమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ట్రావెల్స్ బస్సు ఆదోని నుంచి బళ్లారికి వెళ్తోంది. పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలోకి రాగానే డ్రైవర్ ఉసేన్ (64)కు గుండెపోటు వచ్చింది. బస్సు స్టీరింగ్ అదుపు తప్పడం ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొంది. అందులోని భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మృతి చెందారు.

News February 3, 2025

ఇసుక కావలసినవారు నిబంధనలు పాటించాలి: సీఐ గంగాధర్

image

ఇసుక ఉచితంగా పొందాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహన తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం సేవించటం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై కూడా కేసులో పెడతామన్నారు.