News February 3, 2025

బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

Similar News

News November 5, 2025

ఎస్సీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: రూ.3,500 స్కాలర్‌షిప్

image

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.