News February 3, 2025
సంగారెడ్డి: జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు

జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు పెరగనున్నాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఆయా మండలాల మాసాయిదా జాబితాను విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాలో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 276, జడ్పీటీసీల సంఖ్య 27కు చేరింది.
Similar News
News September 17, 2025
SPMVV ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు నెలలో పీజీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ MBA (మీడియా మేనేజ్మెంట్) 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News September 17, 2025
బ్యాంకింగ్ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయండి: జేసీ

జిల్లాలోని రైతులకు పంట రుణాలు, మహిళా గ్రూపులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువత ఉపాధి రంగానికి అవసరమైన రుణాలను తక్షణమే మంజూరు చేయాలని జేసీ విష్ణు చరణ్ బ్యాంకర్లను సూచించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం రూ.15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యానికి గాను జూన్ 30 నాటికి రూ.5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు.
News September 17, 2025
BlackBuck సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

AP: బెంగళూరు నుంచి తమ ఆఫీసును తరలించాలని అనుకుంటున్నట్లు BlackBuck సంస్థ CEO రాజేశ్ పెట్టిన పోస్టుకు మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ కంపెనీని వైజాగ్‌కు రీలొకేట్ చేసుకోవాలని కోరారు. ఇండియాలో టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో వైజాగ్ ఒకటని పేర్కొన్నారు. ‘ఆఫీసుకి వచ్చి వెళ్లేందుకు 3hr+ పడుతోంది. 9 ఏళ్లుగా ORR ఆఫీస్+ఇల్లుగా మారింది. ఇక ఇక్కడ ఉండలేం. రోడ్లు గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి’ అని రాజేశ్ పేర్కొన్నారు.