News February 3, 2025

అందరి చూపు త్రిషపైనే..!

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News April 3, 2026

ఉపరాష్ట్రపతితో బీఆర్‌ఎస్‌ ఎంపీల భేటీ

image

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ను బీఆర్‌ఎస్‌ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, విప్‌ దీవకొండ దామోదర్‌ రావు గురువారం ఆయన ఛాంబర్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ సింగ్‌ను కలిసి పలు అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు.

News April 3, 2026

అటవీ అభివృద్ధిపై మాజీ, ప్రస్తుత అధికారుల చర్చ

image

అటవీ సంరక్షణ, అభివృద్ధిపై ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారుల భేటీ ఆసక్తిని రేకెత్తించింది. ఖమ్మం జిల్లా ప్రస్తుత డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌.. మాజీ అటవీశాఖ అధికారి రాజేష్‌ మిట్టల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1986లో ఉమ్మడి ఖమ్మం డీఎఫ్‌ఓగా పనిచేసిన మిట్టల్‌తో ప్రస్తుత పరిస్థితులు, అటవీ విస్తరణ, గిరిజన గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. ఆనాటి క్షేత్రస్థాయి అనుభవాలను మిట్టల్‌ పంచుకున్నారు.

News April 3, 2026

ఖమ్మం జిల్లాలో గ్రామ, వార్డు సభలు విజయవంతం

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.