News February 3, 2025
భువనగిరి: జోరందుకున్న వరి నాట్లు

యాదాద్రి జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 2,71,002 ఎకరాలలో వరి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 30 వేల ఎకరాలలో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో అధికంగా సాగైనట్లు చెబుతున్నారు. భువనగిరి, ఆలేరు డివిజన్ల పరిధిలో మల్లన్న సాగర్, గోదావరి జిల్లాలు వస్తుండడంతో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు.
Similar News
News March 17, 2026
శ్రీశైలంలో భక్తులను అలరిస్తున్న కళారూపాల ప్రదర్శన

ఉగాది ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల వేషాలు భక్తులను అలరిస్తున్నాయి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులు, మహిషాసురమర్ధిని, రాక్షస సంహారం, లంబాడీల సంప్రదాయ నృత్యం, మహిళల కోలాటం, రాజభటులు, విచిత్ర వేషధారణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
News March 17, 2026
మెదక్: మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న రెండు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్(సెకండ్ క్లాస్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి నీలిమ తెలిపారు. రిటైర్డ్ లేదా రాజీనామా చేసిన జ్యుడీషియల్ అధికారులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోర్టు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 17, 2026
కేయూ పరీక్ష వాయిదా.. ఏప్రిల్ 4కు మార్పు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడింది. మార్చి 18న జరగాల్సిన ఈ పరీక్షను ఏప్రిల్ 4కి మార్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.


