News February 3, 2025
రేపల్లె: రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగింపు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. రాజకీయ నాయకులకు విగ్రహాలు కూడా ముసుగు వేస్తున్నారు. రేపల్లె పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఆదివారం పలు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించి, విగ్రహాలకు ముసుగులు వేశారు. పలుచోట్ల ఉన్న ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగించాలని నాయకులకు అధికారులు సూచించారు.
Similar News
News April 4, 2026
గద్వాల్: 74 మంది అభ్యర్థులకు ‘ఎన్నికల’ సెగ..!

గద్వాల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ ప్రచారంలో హోరెత్తించిన నేతలకు ఇప్పుడు ‘ఖర్చు’ కష్టాలు మొదలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులో ‘కింగ్’ అనిపించుకున్న నాయకులు, లెక్కలు చెప్పడంలో మాత్రం ‘జీరో’ అయ్యారు. గద్వాల్, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పరిధిలో 298 మంది పోటీ పడగా.. 74 మంది ఇంకా ఖర్చు వివరాలు సమర్పించలేదు. లెక్క చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో అనర్హత వేటు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
News April 4, 2026
రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే..

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 నిమిషాల పాటు సరైన వ్యాయామాలు చేస్తే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా 2 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. తర్వాత నిమిషం పాటు కపాలభాతి చేస్తే బాడీ డిటాక్స్ అవుతుంది. చివరగా భుజంగాసనం, పవనముక్తాసనం వేస్తే లివర్‌కు రక్తప్రసరణ పెరిగి మెటబాలిజం సెట్ అవుతుంది.
News April 4, 2026
మామిడి, అరటి సాగుకు అనువైన నేలలు

మామిడి సాగుకు అన్ని నేలలూ అనుకూలం. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం దిగుబడి ఉంటుంది. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలల్లో నాటకూడదు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య ఉండాలి. అరటి సాగుకు సారవంతమైన, నీటి వసతి, నీరు ఇంకే గుణం, తగినంత సేంద్రీయ పదార్థాల గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్ఠం. ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి.


