News March 19, 2024
ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!
ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
Similar News
News November 17, 2024
ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News November 16, 2024
నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 16, 2024
మంచిర్యాల: భార్యాభర్తలను ఢీకొన్న అంబులెన్స్.. భర్త మృతి
గద్దెరాగడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోట సాంబశివరావు తన భార్య శివపార్వతితో కలిసి శుక్రవారం బైక్ పై మంచిర్యాలకు వెళ్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం MNCLకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. మార్గ మధ్యలోనే సాంబశివరావు మృతి చెందినట్లు SI రాజశేఖర్ వెల్లడించారు. కాగా వారు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి 15 ఏళ్ల క్రితం మందమర్రికి వలస వచ్చారు.