News February 3, 2025
జగన్‌పై హోం మంత్రి అనిత విమర్శలు

గీత కులాలకు మద్యం షాపులు కేటాయించడం నచ్చని జగన్ వైసీపీ న్యాయవాదులతో కేసులు వేయించారని హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. గీత కులాల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 335 మద్యం దుకాణాలను వారికి కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన జగన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆ కులాల వారు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Similar News
News September 17, 2025
తిరుపతి: లాసెట్-25 దరఖాస్తు గడువు పెంపు

న్యాయ కళాశాలల్లోని న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు ఏపీ లాసెట్-25 కన్వీనర్ ఆచార్య సీతాకుమారి మంగళవారం తెలిపారు. 16వరకు ఉన్న రిజిస్ట్రేషన్ గడువును 18వరకు పొడిగించినట్లు చెప్పారు. 18వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 20వ తేదీ వెబ్ ఆప్షన్ల మార్పు, 22న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
News September 17, 2025
జిల్లాలో 18,944 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో 18,944 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వెల్లడించారు. జిల్లాలో ఎరువుల నిల్వల తాజా బులెటిన్‌ను మంగళవారం రాత్రి 8 గంటలకు విడుదల చేశారు. యూరియా 3,192, డిఎపి 1,320, ఎంవోపి 1,647, ఎన్ పి కే 10,568, ఎస్ ఎస్ పీ 2,102, కంపోస్ట్ 83.6, ఎఫ్ ఓ ఎం 29.15 టన్నుల నిల్వ ఉందని స్పష్టం చేశారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన పడొద్దని సూచించారు.
News September 17, 2025
SRCL: ‘మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి’

మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ‘స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన పెంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.