News February 3, 2025
ఇవాళ్టి నుంచి ఆర్టిజన్ల పోరుబాట

TG: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు(సబ్ స్టేషన్ల నిర్వాహకులు) వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు కన్వర్షన్ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ బస్ యాత్రను మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత ఈ నెల 20వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Similar News
News March 24, 2026
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.
News March 24, 2026
BIG NEWS: నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

లోక్‌సభ, శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సెగ్మెంట్లను 50% పెంచి, మహిళలకు 33% రిజర్వేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే బిల్లును ప్రవేశపెట్టనుందని సమాచారం. పునర్విభజనతో లోక్‌సభ సీట్లు 816కు చేరే అవకాశం ఉంది. APలో MLA సీట్లు 262-263కి, LS స్థానాలు 37-38కి, TGలో MLA సీట్లు 178-179కి, LS స్థానాలు 25-26కు చేరనున్నాయి.
News March 24, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.


