News February 3, 2025

విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025

Similar News

News February 3, 2025

ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 3, 2025

కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు

image

కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.