News March 19, 2024

NLG: తొలిరోజు 151 మంది గైర్హాజరు

image

పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 109 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 19, 326 మంది విద్యార్థులకు గాను 19, 175 మంది పరీక్షకు హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ హరిచందన జిల్లా కేంద్రంలోని డైట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు దేవరకొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News August 15, 2025

NLG: జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.

News August 14, 2025

30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

image

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News August 14, 2025

సీఎంకు రేవంత్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

image

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.