News February 3, 2025
HNK: వసంత పంచమి.. పోలీస్ బందోబస్తు

వసత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరం ప్రధాన దేవాలయాలతో పాటు అమ్మవార్ల దేవాలయాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భద్రకాళి దేవస్థానంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు దేవాలయ పరిసరాల్లో ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని సీపీ ఆదేశించారు.
Similar News
News September 15, 2025
సీఎం కాన్ఫరెన్స్‌కు హాజరైన కాకినాడ కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకెళ్లారని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురానున్నారని సమాచారం.
News September 15, 2025
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 37.6 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నాన ఘట్టాల వద్ద నీరు చేరడంతో భక్తులు నదిలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News September 15, 2025
దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.