News February 3, 2025

ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

image

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 3, 2025

అభిషేక్ ఊచకోతకు బౌలర్లు చేతగానివాళ్లలా కనిపించారు: పీటర్సన్

image

నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

EAPCET షెడ్యూల్ ఖరారు

image

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.

News February 3, 2025

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఉత్కంఠ

image

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, అర్వింద్, రామచంద్రరావు రేసులో ఉండగా, కొత్తగా తెరపైకి మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వచ్చాయి. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. OCలకు దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీలకే అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేకుండా ప్రకటించాలని భావిస్తోంది.